కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో కలిసి పరిశీలన
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూచించారు. శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కుడకుడ, బాలాజీ నగర్, శ్రీరాం నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన వినతిని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అడ్డా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాలల ప్రారంభ సమయంలో ట్రాఫిక్ రద్దీ, విద్యార్థుల భద్రత, ప్రజల రాకపోకలు, అడ్డా కూలీల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 9 గంటల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తే రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.
కొత్త బస్టాండ్ ఎదుట ఉన్న అడ్డా కూలీల స్థలాన్ని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కుడకుడ రోడ్డు వైపు కొంత దూరానికి మార్చే అవకాశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు అడ్డా కూలీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి