దండు మల్కాపూర్ గ్రామంలో వేడుకగా కార్యక్రమం
గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో మహిళలు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన 'కప్ప కావడి' కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్, జిల్లా సర్పంచ్ ఫోరం జనరల్ సెక్రటరీ గిర్కటి నిరంజన్ గౌడ్ పాల్గొని కప్పపై నీళ్లు పోశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వర్షకాలంలో పంటలకు సరిపడా వర్షాలు కురిసి, అమ్మవారి ఆశీస్సులతో రైతుల పంటలు పచ్చగా పండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి