Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు

07-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, ఆగస్టు 6: నర్సింగ్ భట్ల గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సంఘ అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిణి జోత్స్న గురువారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.

సంఘంలో మొత్తం 158 మంది సభ్యులు ఉండగా, ఎన్నికల్లో 136 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నికలో అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ అంబటి మల్లయ్య కుమారుడు అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.

గ్రామ చరిత్రలో తొలిసారిగా మత్స్య సహకార సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి నాలుగు తరాలకు చెందిన సభ్యులు తరలివచ్చి ఓటు వేయడం విశేషంగా మారింది.

ఎన్నికల సందర్భంగా ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

Sthanikam

ప్రశాంతంగా నర్సింగ్ భట్ల మత్స్య సొసైటీ ఎన్నికలు: అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు

Article Image

నల్లగొండ, ఆగస్టు 6: నర్సింగ్ భట్ల గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సంఘ అధ్యక్షుడిగా అంబటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిణి జోత్స్న గురువారం అధికారికంగా ఫలితాలను ప్రకటించారు.

సంఘంలో మొత్తం 158 మంది సభ్యులు ఉండగా, ఎన్నికల్లో 136 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సభ్యులు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. అనంతరం డైరెక్టర్ల ఎన్నికలో అధ్యక్షుడిగా మాజీ సర్పంచ్ అంబటి మల్లయ్య కుమారుడు అంబటి వెంకటేశం, కార్యదర్శిగా అంబటి జానకి రాములు, ఉపాధ్యక్షుడిగా అంబటి అంజయ్య ఎన్నికయ్యారు.

గ్రామ చరిత్రలో తొలిసారిగా మత్స్య సహకార సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామానికి నాలుగు తరాలకు చెందిన సభ్యులు తరలివచ్చి ఓటు వేయడం విశేషంగా మారింది.

ఎన్నికల సందర్భంగా ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News