పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు
బీజేపీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ కుటుంబంలో విషాదం నెలకొంది. వారి కుమారుడి అత్త గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు జిల్లా నాయకులతో కలిసి జుట్టుకొండ సత్యనారాయణ నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, బొలిశెట్టి కృష్ణయ్యతో పాటు ఇతర బీజేపీ నాయకులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి