Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 09:43 PM

రైల్వే కోసం విద్యార్థుల గర్జన

రైల్వే కోసం విద్యార్థుల గర్జన

రైల్వే కోసం విద్యార్థుల గర్జన
07-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటకు రైలు వచ్చే వరకు పోరాటం ఆగదు.. భారీ విద్యార్థుల ర్యాలీలో ప్రతిజ్ఞ

సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించాలన్న డిమాండ్‌తో రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థుల భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైల్వే సాధన ఉద్యమానికి మద్దతుగా నినాదాలు చేశారు.

ఉదయం ఎల్‌ఐసీ భవనం వద్ద ప్రముఖ విద్యావేత్త, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లు మధుసూదన్‌రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్త బస్టాండ్, ఎంజీ రోడ్ మీదుగా వాణిజ్య భవన్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. "సూర్యాపేటకు రైల్వే లైన్ కావాలి", "ఇచ్చిన రైల్వే లైన్‌ను మార్చడం సిగ్గు", "రైల్వే ఉద్యమం వర్ధిల్లాలి" అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి.

వాణిజ్య భవన్ చౌరస్తాలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్ధన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీపీఐ(ఎంఎల్)-మాస్‌లైన్ కార్యదర్శి శివకుమార్, సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, సమితి కో-కన్వీనర్లు డాక్టర్ రమేష్ చంద్ర, రాచూరి ప్రతాప్, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మార్జున్, డాక్టర్ వి. రామ్మూర్తి, డాక్టర్ కె. రంగారెడ్డి, యామా ప్రభాకర్, కొత్తపల్లి రేణుక, టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, విద్యావేత్తలు తీకుళ్ల సాయిరెడ్డి, చలపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు ఎల్లారెడ్డి తదితరులు ప్రసంగించారు.

సూర్యాపేటకు రైల్వే లైన్ రావడం ఈ ప్రాంత ప్రజల న్యాయమైన హక్కని వక్తలు పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన రైల్వే మార్గాన్ని మార్చడం ప్రజలను మోసగించడమేనని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలక ప్రాంతంగా ఉన్న సూర్యాపేటకు ఇప్పటికీ రైల్వే సౌకర్యం లేకపోవడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు రైల్వే అభివృద్ధిలో తగిన ప్రాధాన్యం లభించడం లేదని పేర్కొంటూ, సూర్యాపేట రైల్వే లైన్‌ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.

రైల్వే సాధన ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతమైన ప్రజా ఉద్యమంగా బలోపేతం చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువత కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొనాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సామాజిక నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, న్యాయవాది అయోధ్య వెంకట్ యాదవ్, కె. మంజుల, అక్కినపల్లి రాము, సముద్రాల రాంబాబు, మారోజు కృష్ణమూర్తి, పీడీఎస్‌యూ నాయకులు అఖిల్, సింహాద్రి, పిడిమర్తి ఉమేష్, దంతాల కార్తీక్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ర్యాలీ విజయవంతం చేసిన విద్యార్థులకు అభినందనలు

ర్యాలీ విజయవంతానికి సహకరించిన వివిధ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, రైల్వే సాధన సమితి సభ్యులు, ఉద్యమ మద్దతుదారులకు సమితి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. క్రమశిక్షణతో పాల్గొని సూర్యాపేట రైల్వే ఆకాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Sthanikam

రైల్వే కోసం విద్యార్థుల గర్జన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News