Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 11:06 AM

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

11-07-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లాలోని రైతు సోదరులకు ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని రకాల ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా యంత్రాంగం రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం జిల్లాలో రైతులకు పంపిణీ చేయడానికి 19,602 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.యూరియ 9,308 మెట్రిక్ టన్నులు

డిఏపి (DAP)2,481 మెట్రిక్ టన్నులు

ఎంఓపి (MOP) 795 మెట్రిక్ టన్నులు

కాంప్లెక్స్ ఎరువులు 5,612 మెట్రిక్ టన్నులు.

పంట విస్తీర్ణం ఆధారంగా, సరైన రైతుకు సరైన సమయంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం APAIMS 2.0 అనే నూతన పద్ధతి ద్వారా యూరియా మరియు DAP ఎరువులను పంపిణీ చేస్తోంది.ఈ విధానం వల్ల ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత ఉంటుంది. బ్లాక్ మార్కెటింగ్ మరియు ఇతర అవసరాలకు ఎరువులను మళ్లించడాన్ని పూర్తిగా నివారించవచ్చు.ఈ పద్ధతి ద్వారా జిల్లాలో ఇప్పటికే 20,070 మంది రైతులు 52,295 యూరియా బ్యాగులను, 18,582 డిఏపి బ్యాగులను కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల ప్రకారం కలెక్టర్ గారు రైతులకు కీలక సూచన చేశారు.రైతులు బెట్టను తట్టుకొని, తక్కువ కాలంలో చేతికి వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని కోరారు.కంది, ఆముదము,జొన్న, సజ్జ, కొర్ర, అలసంద

జిల్లాలో ఎరువుల పంపిణీపై గానీ, ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై గానీ ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంప్రదించడానికి పుట్టపర్తిలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

హెల్ప్‌లైన్ నెంబర్: 8331057715

జిల్లాలోని రైతు సోదరులందరూ ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌ను మరియు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. శాంప్రసాద్ కోరారు.

Sthanikam

ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News