Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:39 PM

మహిళలే సమాజ భద్రతకు అండ.మల్కాజిగిరి సీపీ బి. సుమతి

14-07-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మీ సురక్ష సహచరి'తో కొత్త కమ్యూనిటీ పోలీసింగ్‌కు శ్రీకారం.

స్వయం సహాయక సంఘాల మహిళలను 'సేఫ్టీ అంబాసిడర్లుగా' తీర్చిదిద్దనున్న పోలీసులు.

హైదరాబాద్ చైతన్యపురి

మహిళలు సాధికారత సాధిస్తేనే కుటుంబం, సమాజం మరింత సురక్షితంగా ఉంటుందని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పేర్కొన్నారు. మహిళలను భద్రత భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 'మీ సురక్ష సహచరి' కార్యక్రమాన్ని నాగోల్‌లో మంగళవారం ఆమె ప్రారంభించారు.

మహిళలే భద్రతకు వారధి

స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతూ చట్టాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యంతో నేరాల నివారణకు తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సీపీ తెలిపారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్–ఎంఈపీఎంఏఎస్‌ఈఆర్‌పీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.

'మహిళ సురక్షితమే.. సమాజ సురక్షితం'

మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను ఆశ్రయించాలని, కాలనీలు, బస్తీల స్థాయిలో మహిళలు భద్రత అంబాసిడర్లుగా వ్యవహరిస్తే నేరాలను ముందుగానే గుర్తించి మహిళలు, చిన్నారుల రక్షణను మరింత పటిష్ఠం చేయవచ్చని అన్నారు. "మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితం.. కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితం" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

సైబర్ నేరాల నుంచి పోక్సో చట్టం వరకు అవగాహన

కార్యక్రమంలో మహిళలకు చట్టపరమైన హక్కులు, వ్యక్తిగత భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, అత్యవసర సేవలు, పోక్సో, ఎన్డీపీఎస్ చట్టాలు, కమ్యూనిటీ పోలీసింగ్, భారోసా సెంటర్లు, షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్ల సేవలపై విస్తృత అవగాహన కల్పించారు. కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాస సేవల వివరాలను కూడా తెలియజేశారు.

మూడు వేల మంది మహిళల భాగస్వామ్యం

నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లకు చెందిన సుమారు 3 వేల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఎంఈపీఎంఏ అదనపు మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. యాదగిరిరావు, డీసీపీలు అనురాధ, కె. సురేష్ కుమార్, శ్రీధర్ తదితర అధికారులు హాజరయ్యారు.

Sthanikam

మహిళలే సమాజ భద్రతకు అండ.మల్కాజిగిరి సీపీ బి. సుమతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News