Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:13 PM

సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

21-07-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.15 లక్షల నగదు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు..

ఆగస్టు 20 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం.

న్యూఢిల్లీ స్థానికం ప్రతినిధి :

దేశానికి గౌరవం తీసుకొచ్చే సాహస వీరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. సాహస క్రీడలు, పర్వతారోహణ, సముద్ర యానం, స్కూబా డైవింగ్, గగనతల సాహస విన్యాసాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థల నుంచి ప్రతిష్ఠాత్మక ‘టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారం–2025’ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

ఈ పురస్కారాలకు జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. భూమి, జల, గగన సాహస రంగాల్లో విశిష్ట సేవలు అందించి, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన వారిని ఈ అవార్డులతో సత్కరించనున్నారు.

విజేతలకు కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రం, బ్లేజర్ (టైతో సహా), రూ.15 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. అనంతరం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం ప్రదానం చేయనున్నారు.

వ్యక్తులు, సంస్థలు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ క్రీడా సమాఖ్యలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అర్హుల పేర్లను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు awards.gov.in పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సూచించింది.

Sthanikam

సాహస వీరులకు కేంద్రం పిలుపు. టెన్సింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News