Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్స్ డే హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 11:17 PM

ప్రజల హక్కులకు అండగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ

15-09-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సమాజంలో ప్రతి ఒక్కరి హక్కులను పరిరక్షిస్తూ, అన్యాయానికి గురయ్యే వారికి అండగా నిలవడమే లక్ష్యంగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీని స్థాపించినట్లు సంస్థ ఫౌండర్, చైర్మన్ కాకర్ల సరస్వతి తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద సంస్థల్లో రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నానని, అదే అనుభవంతో ప్రజల కోసం మరింత సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించేలా కృషి చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం, బాధితులకు అండగా నిలవడం, ప్రజల్లో హక్కులపై అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజల హక్కులు, గుర్తింపు, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పనిచేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని, సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి అందరూ భాగస్వాములు కావాలని కాకర్ల సరస్వతి కోరారు.

Sthanikam

ప్రజల హక్కులకు అండగా హ్యూమన్ రైట్స్ గ్లోబల్ మిషన్ సొసైటీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News