Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముర్కుంజాల్ పాఠశాలలో అవ్యవస్థలు.. ఉపాధ్యాయుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 09, 2026 02:18 PM

“జర్నలిస్టుల హక్కులకు TJWA అండ”

“జర్నలిస్టుల హక్కులకు TJWA అండ”

“జర్నలిస్టుల హక్కులకు TJWA అండ”
09-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జర్నలిస్టుల గళమే.. TJWA బలం.

సంక్షేమం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ముందడుగు

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ప్రజలకు నిత్యం వాస్తవాలను చేరవేస్తూ ప్రజాస్వామ్యానికి వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (TJWA) బలమైన వేదికగా ముందుకు సాగుతోంది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమిష్టిగా స్పందిస్తూ, వారి హక్కుల కోసం అండగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని TJWA జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ గౌడ్, జాతీయ సలహాదారు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలిపారు.

జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలు, గుర్తింపు, సంక్షేమం, విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, వృత్తి భద్రత వంటి అంశాలను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సంస్థల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు పనిచేస్తున్న జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.

సీనియర్లకు గౌరవం.. జూనియర్లకు మార్గదర్శనం

సీనియర్ జర్నలిస్టులకు సముచిత గౌరవం కల్పించడం, నూతన జర్నలిస్టులకు మార్గదర్శకత్వం అందించడం, ప్రతి జర్నలిస్టు సమస్యపై సమిష్టిగా స్పందించడం TJWA ప్రధాన కార్యక్రమాల్లో భాగమని తెలిపారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేస్తూ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన విలువలు, బాధ్యతాయుతమైన జర్నలిజం అభివృద్ధి కోసం మీడియా సంస్థల యజమానులు, చైర్మన్లు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, సీనియర్ జర్నలిస్టులు, మీడియా మిత్రులు TJWAతో కలిసి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

ఇదే TJWA నినాదం

సీనియర్లకు గౌరవం.. నూతన జర్నలిస్టులకు మార్గదర్శకత్వం..

ప్రతి సమస్యకు సమిష్టి స్పందన.. ప్రతి హక్కుకు అండ..

జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం.

మరిన్ని వివరాలకు: TJWA అధికారిక వెబ్‌సైట్ – www.tjwa.in

సంప్రదించండి:

శెట్టి వెంకటేష్ గౌడ్ – జాతీయ ప్రధాన కార్యదర్శి, TJWA.

90520 45435.

డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ – జాతీయ సలహాదారు

9000350446

Sthanikam

“జర్నలిస్టుల హక్కులకు TJWA అండ”

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News