మోకుదెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ గారి సారాధ్యంలో, నూతనంగా నియమితులైన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్(ES/DPEO) నందగోపాల్ సార్ గారిని మంగళవారం నిజామాబాద్ జిల్లా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ వారందరు ఆత్మీయంగా కలిసి సన్మానించడం జరిగింది.
రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ గారు జిల్లాలో ఉన్న గౌడ గీత కార్మికుల సమస్యల పై కులoకుశంగా ES గారితో చర్చిస్తూ నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలంలో గీతావృత్తి రాని, వృత్తికి సంభందంలేని కొంతమంది వ్యక్తులు అక్రమ దారిలో TFT లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికీ లైసెన్సు లు జారిచేయకుండా చూడాలని, వృత్తి ని నమ్ముకుని జీవిస్తున్న వారి జీవనోపాధి ని దెబ్బతీయొద్దని చెప్పడం జరిగింది,దీనిపై ES గారు సా నుకూలంగా స్పందించరాని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ గారితో పాటు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెరుగు శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి సూదుల భూమేష్ గౌడ్, కార్య నిర్వహణ అధ్యక్షులు బొజ్జ చిన్న గౌడ్, ఉపాధ్యక్షులు మడిపల్లి ఉపేందర్ గౌడ్,ఉడుతల కృష్ణాగౌడ్, శ్రీనివాస్ గౌడ్,బొడ్డు తిరుపతి గౌడ్, ఉడుతల భిక్షపతి రాజు గౌడ్ మొదలగు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి