Sthanikam - Truth Matters
Logo

విధి నిర్వహణలో విషాదం.. మహిళా కండక్టర్ మృతి

Updated : 04 Nov 2026 17:12 IST
As Preferred Source 1 min read
విధి నిర్వహణలో విషాదం.. మహిళా కండక్టర్ మృతి

తెలంగాణలోని మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక (24) మృతి చెందారు.విధి నిర్వహణలో భాగంగా కొద్ది రోజుల క్రితం బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలితో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి బస్సు టైర్ల కింద పడటంతో ప్రవళిక తీవ్రంగా గాయపడ్డారు.తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను తొలుత చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం పట్ల ఆర్టీసీ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సహచర ఉద్యోగులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

విధి నిర్వహణలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన ప్రవళిక మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకుందాం.

Sthanikam

విధి నిర్వహణలో విషాదం.. మహిళా కండక్టర్ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి