Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి
14-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి ఎస్ఎఫ్ఐ వినతి

మోడల్ స్కూల్‌ నుంచి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మించాలి

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యార్థుల పలు సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఫీజు బకాయిలు రాకపోవడంతో కొన్ని స్వచ్ఛంద కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపివేస్తూ వేధిస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.​అదేవిధంగా చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుంచి ప్రధాన హైవే వరకు ఉన్న మట్టి రోడ్డు వల్ల వర్షాకాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి అరవింద్, సాత్విక్, శ్రీశాంత్, అజయ్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News