Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

ట్రెండ్ మారింది గురూ..!  మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!
14-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సూర్యాపేట: మహిళలను గౌరవించాలని సూచించే బోర్డులు ఇంతకాలం బస్టాండ్లలో కనిపించేవి. అయితే సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఓ సరికొత్త బోర్డు ఇప్పుడు ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది.

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం”

“పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టండి” అంటూ ఏర్పాటు చేసిన ఈ బోర్డు చూసి ప్రయాణికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. మహిళలకు ప్రత్యేక గౌరవం, సౌకర్యాలపై సందేశాలు కనిపించే రోజుల్లో.. పురుషుల కోసం కూడా ఇలాంటి సందేశం దర్శనమివ్వడం ఆసక్తికరంగా మారింది.

బస్టాండ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!

బోర్డును చూసిన పలువురు ప్రయాణికులు “ట్రెండ్ మారింది గురూ.. మగాళ్లకూ మంచి రోజులొచ్చాయ్!” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ బోర్డు సూర్యాపేట కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులను ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది.

మీ అభిప్రాయం ఏంటి..?

పురుషులకు కూడా ప్రత్యేక గౌరవం, సీట్ల కేటాయింపు అవసరమేనా...?

Sthanikam

ట్రెండ్ మారింది గురూ..! మగాళ్లకూ వచ్చేశాయ్.. మంచి రోజులు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News