Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

ప్రొఫెసర్ మల్లేశంకు దివ్యాంగుల ఫోరం అభినందనలు.చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతల స్వీకరణ.

13-08-2026 117 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్‌ జి.మల్లేశంను విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.అశోక్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ మల్లేశంను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల్లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీడబ్ల్యూడీ యాక్ట్‌–2016ను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే చట్టంపై విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సెమినార్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రిజిస్ట్రార్‌ సానుకూలంగా స్పందించి సెమినార్‌కు సమయం కేటాయించడంతో పాటు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారవేణి చంద్రశేఖర్‌ యాదవ్‌, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, విశ్వవిద్యాలయాల రాష్ట్ర సభ్యుడు గుండె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రొఫెసర్ మల్లేశంకు దివ్యాంగుల ఫోరం అభినందనలు.చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతల స్వీకరణ.

Article Image

హైదరాబాద్‌: వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్‌ జి.మల్లేశంను విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.అశోక్‌ ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ మల్లేశంను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల్లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీడబ్ల్యూడీ యాక్ట్‌–2016ను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే చట్టంపై విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సెమినార్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రిజిస్ట్రార్‌ సానుకూలంగా స్పందించి సెమినార్‌కు సమయం కేటాయించడంతో పాటు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారవేణి చంద్రశేఖర్‌ యాదవ్‌, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, విశ్వవిద్యాలయాల రాష్ట్ర సభ్యుడు గుండె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News