Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

12-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం చనిగేపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల పరిధిలో ఆగస్టు 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షాగుప్తా ఇర్ఫాత్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఫైలేరియా బాధితులు అర్హత ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో లబ్ధిదారులకు సౌకర్యం కలిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News