Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు

12-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఘనంగా ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ ప్రదానోత్సవం

శిల్పకళా వేదికలో అవార్డు అందజేసిన డైరెక్టర్ రమాదేవి

​విద్యాబోధనలో విశిష్ట సేవలు అందిస్తున్న చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ బ్రాంచ్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ పాఠశాలల విభాగంలో ప్రతిఏటా నిర్వహించే ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై చౌటుప్పల్ బ్రాంచ్ బృందానికి ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ​ఈ వేడుకలో నారాయణ సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ ఆర్‌ఎండీ అనిల్, ప్రిన్సిపాల్ నవనీత, కోఆర్డినేటర్ రవిశంకర్, హెచ్ఆర్ సతీష్, డీన్ వెంకన్న, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ చౌటుప్పల్ బ్రాంచ్‌కు ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News