జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు ఆదిమల్ల రవికుమార్ అకాల మరణంతో విషాదం నెలకొంది. ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు సూర్యాపేట జిల్లా దివ్యాంగుల మిత్రబృందం ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులు తమ వంతు సహకారం అందించారు.
ఈ సందర్భంగా రవికుమార్ కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని మిత్రబృందం సభ్యులు అందజేశారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహాయం అందించి అండగా నిలిచినట్లు మిత్రబృందం సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్ నయీమ్, కొరివి సైదులు, బెంగారపు బిక్షపతి, వీరమల్ల యాదగిరి, కర్నాటి జయకృష్ణ, నల్లెడ మాధవరెడ్డి, యుద్ధ సైదులు, ఏలే జానయ్య, సీఎం సైదులు, ఉప్పేనపల్లి సైదులు, ఎరుకల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి