నజీమ్ పటేల్‌కు కేటీఆర్, హరీశ్‌రావు, క్రాంతికిరణ్ ఆశీస్సులు
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నజీమ్ పటేల్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నజీమ్ పటేల్‌కు శాలువా కప్పి, కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారంలో నజీమ్ పటేల్ ఎప్పుడూ ముందుండాలని వారు ఆకాంక్షించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నజీమ్ పటేల్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్, హరీశ్‌రావు మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి, విద్యార్థుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు సాయి, పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త అల్లం పవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి