Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన

12-08-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం జామ్గి రైతు వేదికలో ఆత్మ (ATMA) శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13న రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నారు. కేవీకే శాస్త్రవేత్త రమేష్ రైతులకు ఎల్‌నినో ప్రభావ పరిస్థితుల్లో నూనెగింజల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా, నానో డీఏపీ, హెచ్‌డీ కాటన్, అంతర పంటల సాగు, సమగ్ర సస్యరక్షణ తదితర అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పించనున్నారు. ఆధునిక పద్ధతులను పాటించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పంట దిగుబడిని పెంచుకోవడం, ఎరువులను సమర్థవంతంగా వినియోగించడం, పురుగు–తెగుళ్లను సమగ్రంగా నియంత్రించడం వంటి అంశాలపై రైతులకు సూచనలు ఇవ్వనున్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణపై కూడా అవగాహన కల్పించనున్నారు. కంగ్టి మండల రైతులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరై సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వి. హరీష్ తెలిపారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయం.. నానో ఎరువులపై రైతులకు అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News