నారాయణఖేడ్‌లోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్‌కు చెందిన రోబోటిక్స్ ఇన్ అకాడెమిక్స్ (RiA) ఆధ్వర్యంలో, గెయిన్‌సైట్ సహకారంతో ఒకరోజు ప్రాక్టికల్ రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. పాఠశాలలో తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 104 మంది విద్యార్థులు పాల్గొనగా, వారికి రోబోటిక్స్ ప్రాథమిక అంశాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సర్లు, మోటార్లు, సర్క్యూట్ల తయారీ తదితర అంశాలపై ప్రత్యక్ష శిక్షణ అందించారు.విద్యార్థులు స్వయంగా సర్క్యూట్లు తయారు చేసి, రోబోటిక్ పరికరాలతో ప్రయోగాలు చేయడం ద్వారా ప్రాక్టికల్‌గా నేర్చుకున్నారు. ఈ శిక్షణతో విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు, జట్టు భావన, శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే పాఠశాలలో రోబోటిక్స్ క్లబ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ, రాబోయే ఇన్నోవేషన్ మేళాల్లో విద్యార్థులు తమ ఆలోచనలను ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసుకునేలా ప్రోత్సహించారు.కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీనిధి, పండరి సహా 17 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు యాదగిరి, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య, అశోక్ గౌడ్, మురళి, ధన్‌సింగ్, సోహం ఫౌండేషన్ ప్రతినిధి అరవింద్, ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల ప్రతినిధులు దయాకర్, కృపాకర్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. సహదేవ్ కొమరగిరి స్థాపించిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రాక్టికల్ రోబోటిక్స్ విద్యను అందిస్తున్నారు.
నారాయణఖేడ్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ రోబోటిక్స్ శిక్షణ

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి