Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

Updated : 12 Aug 2026 19:32 IST
As Preferred Source 1 min read
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాకు రానున్న నేపథ్యంలో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి దత్తు రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వం వాటిని విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బకాయిలు సకాలంలో అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తీసుకువస్తున్నాయని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి నియమించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం సంగారెడ్డి జిల్లాకు వస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేపడతామని దత్తు రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇసాక్, అభిషేక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి.. లేదంటే సీఎం పర్యటనలో నిరసన: ఏఐఎస్ఎఫ్

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news