భార్యాభర్తలను హత్య చేసి పాతిపెట్టిన దుండగులు
సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో భార్యాభర్తల జంట హత్యలు కలకలం సృష్టించాయి. బీక్యా తండాకు చెందిన హలావత్ నాగు, బూబా దంపతులు పొట్టకూటి కోసం మోతెకు వచ్చి భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ గత రెండేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు దంపతుల తలపై బలంగా కొట్టి హత్య చేసిన అనంతరం మృతదేహాలను తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టినట్లు సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్పీ నరసింహ తెలిపారు.
ఉదయం అటుగా వెళ్తున్న రైతులు అనుమానాస్పద పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాతిపెట్టిన మృతదేహాలను వెలికితీయగా బీక్యా తండాకు చెందిన నాగు, బూబా దంపతులుగా స్థానికులు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ నరసింహ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షించారు. హత్యలకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి