Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్

12-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గంట వర్షానికే కురుస్తున్న భవనం.. భయంలో చిన్నారులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రుల డిమాండ్

చౌటుప్పల్ మండలం చిన్నకొండూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో గంటసేపు వర్షం పడితే చాలు తరగతి గదుల పైకప్పు నుంచి నీరు కారుతోంది. ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాటు, సరిపడా తరగతి గదులు లేక బోధన సక్రమంగా సాగడం లేదు. ప్రభుత్వం నుంచి ఒక తరగతి గదికి మాత్రమే నిధులు మంజూరయ్యాయని, అది ఏమాత్రం సరిపోదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా, తక్షణమే భవనానికి సమగ్ర మరమ్మతులు చేపట్టి, అదనపు గదులను నిర్మించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

శిథిలావస్థలో చిన్నకొండూర్ ప్రైమరీ స్కూల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News