Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌

12-08-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

● వైద్యుల ఉచిత సలహాతో టీకాలు వేయించుకోవాలి

​● చౌటుప్పల్‌ వాసి డీ. శాన్వి పిలుపు

​సకాలంలో వైద్యుల సలహాలు పాటిస్తూ తగిన టీకాలు వేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్‌ ముప్పును ముందస్తుగానే నివారించవచ్చని చౌటుప్పల్‌కు చెందిన డీ. శాన్వి స్పష్టం చేశారు. బుధవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేందుకు వైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రశాంతి సలహా మేరకు తాను ‘గార్డాసిల్‌-9’ (GARDASIL 9) వ్యాక్సిన్‌ తీసుకున్నానని, తన తమ్ముడు సన్వీర్‌కు ‘గార్డాసిల్‌-4’ (GARDASIL 4) వేయించినట్లు తెలిపారు.

​క్యాన్సర్‌ నివారణ వ్యాక్సిన్లపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా శాన్వి కోరారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్‌ తీసుకోని వారు తమ వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి అర్హత ఉందో లేదో వైద్యులను కలిసి నిర్ధారించుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారు వెంటనే టీకాలు వేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని వైద్యురాలు ప్రశాంతి తనకు సూచించినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అందరూ వ్యాక్సినేషన్‌పై ముందడుగు వేయాలని డీ. శాన్వి, డీ. సన్వీర్‌, డాక్టర్‌ ప్రశాంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ముందస్తు వ్యాక్సినేషన్‌తోనే క్యాన్సర్‌కు చెక్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News