Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

నాగోలులో గంజాయి గ‘రం’.. 23 కిలోలు పట్టివేత!

13-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.11.51 లక్షల విలువైన 23.02 కిలోల గంజాయి స్వాధీనం

ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు.. రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు సీజ్‌

నాగోలు, ఆగస్టు 12 (స్థానికం ప్రతినిధి): ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఎస్‌ఓటీ ఎల్బీనగర్ జోన్, నాగోలు పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 23.02 కిలోల గంజాయి, రెండు కార్లు, రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.11.51 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 11న ఒడిశా నుంచి రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో నాగోలు ఎక్స్‌రోడ్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన టయోటా ఇన్నోవా, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వాహనాలను తనిఖీ చేయగా.. డిక్కీల్లో దాచిన ఆరు ప్యాకెట్లలో 23.02 కిలోల గంజాయి బయటపడింది.

అరెస్టయిన వారిని ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన త్రినాథ్ నిరికె (40), సోనా హుంతల్ (28)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే గంజాయి రవాణాకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కమ్ము కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గంజాయి సరఫరా గొలుసులో ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో, ఎల్బీనగర్ జోన్ డీసీపీ బి. అనురాధ, ఎస్‌ఓటీ అధికారులు, నాగోలు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

Sthanikam

నాగోలులో గంజాయి గ‘రం’.. 23 కిలోలు పట్టివేత!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News