సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గురువారంపి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ బైరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... తిరుమలగిరిపి.ఎ.సి.ఎస్ చైర్మన్ పదవి రెడ్డిలకు ఇవ్వాలని అన్నారు. మేము కాంగ్రెస్ పార్టీకి గత 30 సంవత్సరాలుగా మా కుటుంబమంతా విధేయులుగా పని చేశామని, వెలిశాల గ్రామానికి ఎన్నో సేవలు చేశామని,ఐదుసార్లు సర్పంచ్ గా గెలుపు కోసం కృషి చేశామని, పార్టీలో వర్గ బేధాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోయి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గుర్తించి పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలని దీనికి అర్హుడిని అని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎంపీ చామల,ఎమ్మెల్యే సామేలుకు వేడుకుంటున్నానని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి