Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

ఘనంగా వీసం నరేందర్ జన్మదిన వేడుకలు

ఘనంగా వీసం నరేందర్ జన్మదిన వేడుకలు

ఘనంగా వీసం నరేందర్ జన్మదిన వేడుకలు
13-08-2026 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు

యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయతీ సెక్రటరీల సంఘం అధ్యక్షుడు, ఇంద్రపాలనగరం పంచాయతీ కార్యదర్శి వీసం నరేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామన్నపేట మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఆత్మీయులు, స్నేహితుల సమక్షంలో వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా వీసం నరేందర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో దొడ్డి స్వామి, నాగటి ఉపేందర్, పెరుమాండ్ల యాదగిరి, అప్పం సురేందర్, బాషమల్ల సంతోష్, కర్నె వినయ్, భూతం శ్రీకాంత్, బాధే అశోక్, చంద్రశేఖర్, నాగటి నరేష్ తదితరులు పాల్గొని వీసం నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఘనంగా వీసం నరేందర్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News