Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు

13-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు.

రద్దీ బస్సులే టార్గెట్‌.. సెల్‌ఫోన్లు, నగదే లక్ష్యం | రెండు సెల్‌ఫోన్లు, ఆటోరిక్షా, రూ.3 వేల నగదు స్వాధీనం

రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల జేబులు కొట్టి సెల్‌ఫోన్లు, నగదు అపహరిస్తున్న ముగ్గురిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా.. మరొకరు వారిలో ఒకరి భర్త కావడం గమనార్హం. కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్న ఈ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఆటోరిక్షా, రూ.3 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కవిత (A1), నాగమణి (A2), ప్రసాద్ (A3) కలిసి రద్దీగా ఉండే బస్సులను లక్ష్యంగా చేసుకుని పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్నారు. నిన్న చోరీ చేసిన ప్రాంతానికే మళ్లీ వచ్చి అదే తరహాలో దొంగతనానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పాత కేసులపైనా ఆరా

నిందితులపై ఇప్పటికే పలు జిల్లాల్లో సుమారు 16 పాత కేసులు ఉన్నట్లు టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో ప్రయాణికుల అప్రమత్తతను ఆసరాగా చేసుకుని వీరు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పక్కా సమాచారంతో వల

డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. టూ టౌన్ ఎస్సైలు డి. సైదాబాబు, మహిళా ఎస్సై మానసతో పాటు కానిస్టేబుళ్లు బాలకోటి, షకీల్ బృందంగా ఏర్పడి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

Sthanikam

కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News