Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు
13-08-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బాధితుల ఆరోపణ.

అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు.

చిట్యాల: తమ భూమిలోకి కొందరు అక్రమంగా ప్రవేశించి, చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని జోగు ప్రవీణ్ ఆరోపించారు. ఈ ఘటనపై గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా మిత్రులకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

తమ తాతకు సంబంధించిన భూమికి అన్ని హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తాము భూమిని సాగు చేసుకుంటున్న సమయంలో గత నెల రాత్రి కొందరు వ్యక్తులు వచ్చి భూమి చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారని తెలిపారు. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు ఎమ్మార్వో, ఆర్డీవో అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

వెంకటస్వామిపై దుర్భాషలను ఖండించిన బాధితులు.

భూ వివాదంలో తమకు న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి నాయకుడు నూనె వెంకటస్వామిని సంప్రదించామని బాధితులు తెలిపారు. తమకు మద్దతుగా వచ్చిన వెంకటస్వామిని కొందరు దుర్భాషలాడడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న వెంకటస్వామిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

భూ వివాదంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, హక్కు పత్రాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Sthanikam

భూమిలోకి అక్రమ ప్రవేశం.. కంచె తొలగింపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News