Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్

13-08-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పంతంగిలో ఘనంగా శ్రావణమాస కుమ్మరుల తొలిబోనం జాతర

అమ్మవారికి మట్టికుండలోనే నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రీతికరమని కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా కుమ్మరుల తొలి బోనం జాతర కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు వట్టిపల్లి జంగయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి సిలివేరు శ్రీనివాస్-ధనలక్ష్మి దంపతులు, మండల ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రావణమాస బోనాల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టికుండలనే వినియోగించాలని కోరారు. బంగారు, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం సరికాదని, మట్టికుండల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో తొలిబోనం జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

​ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాధారపు భగవంత్, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి భాస్కర్, కుల పెద్దలు ఇస్తారి, సుక్కయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, లింగస్వామి, సురేష్, సోమయ్య, ధనంజయ్, విజయ్, మల్కాపురం గ్రామానికి చెందిన మల్లేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

అమ్మవారికి మట్టికుండ నైవేద్యమే ప్రీతికరం-కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్

Article Image

పంతంగిలో ఘనంగా శ్రావణమాస కుమ్మరుల తొలిబోనం జాతర

అమ్మవారికి మట్టికుండలోనే నైవేద్యం సమర్పించడం ఎంతో ప్రీతికరమని కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్ అన్నారు. చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా కుమ్మరుల తొలి బోనం జాతర కార్యక్రమాన్ని గ్రామ అధ్యక్షుడు వట్టిపల్లి జంగయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి సిలివేరు శ్రీనివాస్-ధనలక్ష్మి దంపతులు, మండల ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. శ్రావణమాస బోనాల మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ మట్టికుండలనే వినియోగించాలని కోరారు. బంగారు, వెండి పాత్రల్లో నైవేద్యం సమర్పించడం సరికాదని, మట్టికుండల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతుందని తెలిపారు. గ్రామంలో తొలిబోనం జాతరను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

​ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రాధారపు భగవంత్, ప్రధాన కార్యదర్శి వట్టిపల్లి భాస్కర్, కుల పెద్దలు ఇస్తారి, సుక్కయ్య, మల్లేష్, శ్రీనివాస్, వెంకటయ్య, లింగస్వామి, సురేష్, సోమయ్య, ధనంజయ్, విజయ్, మల్కాపురం గ్రామానికి చెందిన మల్లేష్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News