Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.

13-08-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొండ వెంకటేష్–ఉమా దంపతుల ప్రత్యేక పూజలు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం(చిన్న శ్రీశైలం)లో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ అమావాస్య కు కొండ వెంకటేష్–ఉమా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న గుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు భక్తులు గుట్టపైనే నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.

Sthanikam

అమావాస్య వేళ.. మల్లన్న గుట్టపై భక్తుల సందడి. చిన్న శ్రీశైలంలో ఘనంగా ప్రత్యేక పూజలు.

Article Image

కొండ వెంకటేష్–ఉమా దంపతుల ప్రత్యేక పూజలు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని మల్లన్న గుట్టపై కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం(చిన్న శ్రీశైలం)లో అమావాస్య సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ అమావాస్య కు కొండ వెంకటేష్–ఉమా దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రదోష వేళ సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న గుట్టకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం పలువురు భక్తులు గుట్టపైనే నిద్ర చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News