Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

13-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ.29 కోట్ల వ్యయంతో మంజూరైన సివిల్ కోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 365 పక్కన కోర్టు భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టు మంజూరు చేయించుకున్నామని తెలిపారు. రూ.29 కోట్లతో నిర్మించనున్న కోర్టు భవనానికి స్థల పరిశీలన పూర్తయిందని, అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.తుంగతుర్తి కేంద్రంలో సివిల్ కోర్టు ఏర్పాటుతో నియోజకవర్గ ప్రజలకు న్యాయపరమైన సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని, న్యాయం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు. కోర్టు భవన నిర్మాణం పూర్తయితే తుంగతుర్తి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

Sthanikam

.తుంగతుర్తిలో సివిల్ కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News