Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి

13-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులని, క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మందోల్లగూడెం మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోరం ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాలలో 25 మంది, మందోల్లగూడెం ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో షూలను ఉచితంగా అందజేశారు. ​ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.​కార్యక్రమంలో తూర్పుగూడెం ప్రాథమిక పాఠశాల ఏఏపీసీ చైర్మన్ పిట్టల సంతోష్, 7వ వార్డు సభ్యుడు మానే రవికుమార్, 8వ వార్డు సభ్యుడు గుండు శ్రీశైలం, తూర్పుగూడెం ప్రధానోపాధ్యాయులు ఎస్. పరమేష్, ఉపాధ్యాయురాలు జి. వరలక్ష్మి, మందోల్లగూడెం ప్రధానోపాధ్యాయురాలు ఎన్. సంధ్య, గ్రామానికి చెందిన యువకులు గుండు ప్రశాంత్, నిలిగొండ రఘు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు షూల పంపిణీ.. దాతృత్వం చాటుకున్న బోరం ప్రకాశ్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News