Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

గూడెం వాసి రుద్రవరం సునీల్‌కు డాక్టరేట్

గూడెం వాసి రుద్రవరం సునీల్‌కు డాక్టరేట్

గూడెం వాసి రుద్రవరం సునీల్‌కు డాక్టరేట్
13-08-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం సునీల్ పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ వర్క్‌లో సామాజిక అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.

ప్రొఫెసర్ ఎస్.ఎఫ్. చంద్రశేఖర్ సూపర్‌వైజర్‌గా, ప్రొఫెసర్ చింత గణేష్ జాయింట్ సూపర్‌వైజర్‌గా వ్యవహరించిన ఈ పరిశోధనలో “ఇంపాక్ట్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్” అనే అంశాన్ని సునీల్ అధ్యయనం చేశారు.

డాక్టరేట్ సాధించిన సందర్భంగా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సునీల్‌ను అభినందించారు. తన డాక్టరేట్‌ను తల్లిదండ్రులు చంద్రయ్య, యాదమ్మకు అంకితం చేస్తున్నట్లు సునీల్ తెలిపారు. తన పరిశోధనకు సహకరించిన ప్రొఫెసర్లు, తోటి పరిశోధక విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆరు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు..

తన చిన్ననాటి అనుభవాలను గుర్తుచేసుకున్న సునీల్.. శివనేనిగూడెం నుంచి చిట్యాల ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు ఆరు కిలోమీటర్లు నడిచేవాడినని తెలిపారు. ఒకవైపు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే మరోవైపు చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం వైపు ముందుకు సాగానన్నారు.

జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించే వరకు వెనుకడుగు వేయొద్దని, ప్రస్తుత విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని సునీల్ సూచించారు.

Sthanikam

గూడెం వాసి రుద్రవరం సునీల్‌కు డాక్టరేట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News