Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుటుంబ సమేతంగా పిక్‌పాకెటింగ్.. టూ టౌన్ పోలీసులకు చిక్కిన ముగ్గురు పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 13, 2026 10:20 PM

నల్లగొండలో వైభవంగా బోనాల ఉత్సవాలు..

నల్లగొండలో వైభవంగా బోనాల ఉత్సవాలు..

నల్లగొండలో వైభవంగా బోనాల ఉత్సవాలు..
13-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బోనమెత్తి అమ్మవారికి పూజలు నిర్వహించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..

నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో నగర పాలిక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తుకొని ఊరేగింపులో సందడి చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు."బోనం అంటే అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే పవిత్ర నైవేద్యం. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, నల్లగొండ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆ జగన్మాతను ప్రార్థించానని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. వేడుకల్లో పాల్గొన్న వారిలో,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న, వీరితో పాటు పలువురు డివిజన్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేశారు.

Sthanikam

నల్లగొండలో వైభవంగా బోనాల ఉత్సవాలు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News