Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:06 PM

సరూర్‌నగర్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు 428 ఇళ్లలో సోదాలు.. 33 వాహనాలు అదుపులోకి!

14-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

సరూర్‌నగర్‌లోని భగత్‌సింగ్‌నగర్‌లో పోలీసులు భారీ స్థాయిలో కమ్యూనిటీ కనెక్ట్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. సీపీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో 428 ఇళ్లను తనిఖీ చేసి వివరాలను నమోదు చేయగా.. 369 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

494 వాహనాల తనిఖీ.. 33 వాహనాలు డిటెయిన్

తనిఖీల్లో భాగంగా మొత్తం 494 వాహనాలను పరిశీలించారు. ఇందులో 436 ద్విచక్ర వాహనాలు, 28 త్రిచక్ర వాహనాలు, 30 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి. సరైన పత్రాలు లేని 33 వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.85,282 వసూలు చేశారు.

మద్యం, గుట్కా స్వాధీనం.

కార్డన్ సెర్చ్‌లో సుమారు రూ.20,500 విలువైన 18.72 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు సుమారు రూ.14,300 విలువైనవి సీజ్ చేశారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. 221 వాహనాలను తనిఖీ చేసి.. 120 ద్విచక్ర వాహనాలు, 101 నాలుగు చక్రాల వాహనాలపై చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల ద్వారా మొత్తం రూ.76,735 జరిమానా వసూలు చేశారు.

అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు

డీసీపీ ఎల్‌బీనగర్, అదనపు డీసీపీ ఎల్‌బీనగర్, ఏసీపీ ఎల్‌బీనగర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్‌బీనగర్ జోన్ పోలీసు బలగాలతో పాటు SOT, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

ప్రజా భద్రతే లక్ష్యం.

ప్రాంతంలో పోలీసుల ఉనికిని మరింత పెంచడం, ప్రజలతో నేరుగా సంబంధాలు బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరస్తులను గుర్తించడం, ప్రజలకు భద్రత కల్పించడమే ఈ కమ్యూనిటీ కనెక్ట్ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

Sthanikam

సరూర్‌నగర్‌లో పోలీసుల మెరుపు తనిఖీలు 428 ఇళ్లలో సోదాలు.. 33 వాహనాలు అదుపులోకి!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News