Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

ఉద్యమకారుల సేవలకు ఘన సత్కారం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన సేవలకు ప్రశంస పత్రాలు.

14-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల సేవలను గుర్తిస్తూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ కాచం సత్యనారాయణ, ఎల్బీనగర్ ఇన్‌చార్జి బీరెల్లి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కంఠం సైదులుకు ప్రశంస పత్రాన్ని అందజేసి సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో వారి పాత్రను కాచం సత్యనారాయణ కొనియాడారు. ఉద్యమం కోసం అహర్నిశలు శ్రమించిన వారిని గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అన్నారు.

ఉద్యమ చరిత్రను భావితరాలకు చాటాలి

ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన పలువురు ఉద్యమకారులకు కూడా ప్రశంస పత్రాలు అందజేశారు. నర చంద్రశేఖర్‌రెడ్డి, ఈ. అశోక్‌కుమార్, కడిమల గోపాల్, బొమ్మకంటి శ్రీనివాస్, చింతపట్ల రవీందర్, అనంతకుమార్, అశోక్‌కుమార్ తదితరులను సత్కరించారు.

తెలంగాణ కోసం సాగిన ఉద్యమ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని, ఉద్యమకారుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కాచం సత్యనారాయణ, బీరెల్లి వెంకట్‌రెడ్డి అన్నారు.

Sthanikam

ఉద్యమకారుల సేవలకు ఘన సత్కారం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన సేవలకు ప్రశంస పత్రాలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News