Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు

14-08-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కార్యాలయం ఎదుట సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల ధర్నా

అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 326లో (స్మశాన వాటిక పక్కన) చౌటుప్పల్ మున్సిపాలిటీ చెత్త నిల్వ కోసం చేపడుతున్న డంపింగ్ యార్డ్‌ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.​జనవాసాలు, పాఠశాలలకు కనీసం 2 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రం అందజేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ... ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్‌ను ఇతర ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సుర్వి సత్తయ్య గౌడ్, పర్ని శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల సెట్టయ్య గౌడ్, భీమగోని మల్లేశం గౌడ్, కాకులారం సంజీవరెడ్డి, బత్తుల అనూష, దొడ్ల అండాలు, రాపోలు రేణుక, గ్రామ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంకిరెడ్డిగూడెంలో డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News