Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:03 PM

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.

14-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము పిలుపునిచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేటి సమాజంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.

యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

యువతే దేశ భవిష్యత్తు

యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

Sthanikam

భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి: డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము.

Article Image

యువత మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు శానగొండ రాము పిలుపునిచ్చారు. కొమ్మాయిగూడెం గ్రామంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ సమావేశంలో ఆయన మాట్లాడారు.

నేటి సమాజంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వంటి వ్యసనాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవల వైపు అడుగులు వేయాలని సూచించారు.

యువత ఎదుర్కొంటున్న ఉపాధి, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు క్రీడా మైదానాలు, యువజన కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

యువతే దేశ భవిష్యత్తు

యువతే దేశ భవిష్యత్తు అని, సమాజ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని శానగొండ రాము అన్నారు. యువజన సమస్యల పరిష్కారం కోసం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News