Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:13 AM

పోచమ్మ ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే నేరానికి కారణం.. బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం

19-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి, జూలై 19: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ఈ నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, హుండీలోని నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై తీవ్ర అప్పుల్లో కూరుకుపోవడంతో డబ్బు కోసం దేవాలయాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది. అర్ధరాత్రి సమయంలో ఆలయం తాళాలు పగులగొట్టి, సీసీటీవీ వైర్లు కత్తిరించిన అనంతరం అమ్మవారి బంగారు పుస్తెలు, హుండీని అపహరించాడు. తర్వాత హుండీని పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నాడు.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, శాస్త్రీయ సాక్ష్యాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు తరలించింది.

కేసును వేగంగా ఛేదించిన క్రైమ్ ఎస్‌ఐ కె. మహేందర్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని సరూర్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. శేఖర్, ఎన్‌హెచ్‌బీ ఆర్‌ఐ ఎన్. శ్రీశైలం అభినందించారు.

Sthanikam

పోచమ్మ ఆలయంలో చోరీ.. 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనమే నేరానికి కారణం.. బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, నగదు స్వాధీనం

Article Image

చైతన్యపురి, జూలై 19: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయంలో ఈ నెల 16న జరిగిన చోరీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన బూర్ల అనిల్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి అమ్మవారి బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, హుండీలోని నగదును స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనానికి బానిసై తీవ్ర అప్పుల్లో కూరుకుపోవడంతో డబ్బు కోసం దేవాలయాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లు వెల్లడైంది. అర్ధరాత్రి సమయంలో ఆలయం తాళాలు పగులగొట్టి, సీసీటీవీ వైర్లు కత్తిరించిన అనంతరం అమ్మవారి బంగారు పుస్తెలు, హుండీని అపహరించాడు. తర్వాత హుండీని పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నాడు.

సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, శాస్త్రీయ సాక్ష్యాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు రిమాండ్‌కు తరలించింది.

కేసును వేగంగా ఛేదించిన క్రైమ్ ఎస్‌ఐ కె. మహేందర్‌తో పాటు దర్యాప్తు బృందాన్ని సరూర్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. శేఖర్, ఎన్‌హెచ్‌బీ ఆర్‌ఐ ఎన్. శ్రీశైలం అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News