Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:09 AM

సామాజిక సేవకు'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్'అవార్డు గుర్తింపు

19-07-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ సేవలకు తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్‌కు

- ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేత..

యాదాద్రి భువనగిరి జిల్లా,భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్‌కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్'అవార్డు లభించింది.ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కళావేదికలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ర్యాకల సంతోష్ శ్రీనివాస్ తమ ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు,ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.సమాజ సేవతో పాటు గ్రామాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని వారు కొనియాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ...ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ గుర్తింపు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న తాజ్‌పూర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పట్నం కమల,మనోహర్,సంస్థ ప్రతినిధులు,ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సామాజిక సేవకు'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్'అవార్డు గుర్తింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News