Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:14 AM

హలో ఉద్యమకారుడా.. చలో హైదరాబాద్ కేకే కమిటీకి వినతులు సమర్పించండి. ఉద్యమకారులందరూ పాల్గొని సూచనలు ఇవ్వాలి: జోగు అంజన్న

19-07-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారు, లాఠీ దెబ్బలు, భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ఎదుర్కొన్నవారు, కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపినవారు, ఆస్తులు కోల్పోయి నేటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలు మరుగునపడిన నేపథ్యంలో గత తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిరంతర పోరాటం సాగిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని చేర్చడంతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.

తొలి దశ, మలి దశ ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే కమిటీ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వేదిక వద్ద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో జూలై 20న అన్ని ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల నాయకులు, నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ సూచనలు, సలహాలు, వినతిపత్రాలను కేకే కమిటీకి సమర్పించాలని కోరారు. ప్రతి నిజమైన ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమకారుల ఫోరం అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని జోగు అంజన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Sthanikam

హలో ఉద్యమకారుడా.. చలో హైదరాబాద్ కేకే కమిటీకి వినతులు సమర్పించండి. ఉద్యమకారులందరూ పాల్గొని సూచనలు ఇవ్వాలి: జోగు అంజన్న

Article Image

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినవారు, లాఠీ దెబ్బలు, భాష్పవాయువు, రబ్బరు బుల్లెట్లను ఎదుర్కొన్నవారు, కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపినవారు, ఆస్తులు కోల్పోయి నేటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలు మరుగునపడిన నేపథ్యంలో గత తొమ్మిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో నిరంతర పోరాటం సాగిందన్నారు. ఆ పోరాట ఫలితంగానే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని చేర్చడంతో పాటు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు.

తొలి దశ, మలి దశ ఉద్యమకారులను గుర్తించేందుకు కేకే కమిటీ ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వేదిక వద్ద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో జూలై 20న అన్ని ఉద్యమకారులు, ఉద్యమ సంఘాల నాయకులు, నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ సూచనలు, సలహాలు, వినతిపత్రాలను కేకే కమిటీకి సమర్పించాలని కోరారు. ప్రతి నిజమైన ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు ఉద్యమకారుల ఫోరం అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని జోగు అంజన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News