Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రద్ధగా వింటే విజయం మీదే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 19, 2026 06:18 AM

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
July 19, 2026 01:08 AM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్


సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యాపేట సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా సూపర్ ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.


తక్కువ నీటి అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడంతో పాటు రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సూచనలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షపాతం పరిస్థితులు, తాగునీటి లభ్యత, వ్యవసాయ ప్రణాళికలు, శాఖల వారీ కార్యాచరణపై సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.


జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశాలకు అన్ని శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని, అడిగే ప్రతి అంశంపై పీపీటీ, ప్రింట్ కాపీలు, పెన్‌డ్రైవ్, మొబైల్‌లో సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.


వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ జూలై 20న ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు.


సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్‌డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, హార్టికల్చర్ అధికారి నాగయ్య, డీఈఓ అశోక్, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News