Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రద్ధగా వింటే విజయం మీదే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 19, 2026 06:21 AM

కంటి చూపు కోసం వెళ్తే.. చీకట్లు మిగిలాయా?

కంటి చూపు కోసం వెళ్తే.. చీకట్లు మిగిలాయా?

కంటి చూపు కోసం వెళ్తే.. చీకట్లు మిగిలాయా?
July 19, 2026 01:08 AM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపై రోగి కుటుంబం ఆవేదన – ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్

కంటి చూపు మెరుగుపడుతుందనే ఆశతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఓ వృద్ధ మహిళ, చికిత్స అనంతరం కంటిచూపు మరింత దెబ్బతిన్నట్లు ఆరోపిస్తూ కన్నీరుమున్నీరవుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన గొల్లోజు రాములమ్మకు నల్లగొండ గొల్లగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన చికిత్సపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారుల జోక్యాన్ని కోరుతున్నారు.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, కంటికి మసకగా కనిపిస్తోందని రాములమ్మ ఈ నెల 8న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు కంటి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం వారం రోజుల తర్వాత పరీక్షల కోసం రావాలని సూచించారు. సూచన మేరకు తిరిగి ఆసుపత్రికి వెళ్లిన రాములమ్మకు కంటిలో బుడగ (బ్లిస్టర్) ఏర్పడిందని వైద్యులు తెలిపి మళ్లీ కుట్లు వేసి మరోసారి శస్త్రచికిత్స చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం మరో వారం రోజులు తర్వాత రావాలని సూచించారని, అయితే కుట్లు వేసినప్పటి నుంచి కంటిలో తీవ్రమైన మంట, నొప్పి, అసౌకర్యం ఉందని పలుమార్లు వైద్యులకు తెలిపినా, "శస్త్రచికిత్స తర్వాత ఇలాంటి నొప్పులు సహజమే" అంటూ ఇంటికి పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

గతంలో కొంత మసకగా కనిపించిన కన్ను, ఇప్పుడు పూర్తిగా చూపు కోల్పోయే పరిస్థితికి చేరుకుందని రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కంటితో ఏమీ కనిపించడం లేదని, తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల పట్ల వైద్యులు మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రోగి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, చికిత్సలో ఏవైనా నిర్లక్ష్యం జరిగి ఉంటే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. అలాగే రాములమ్మకు మెరుగైన వైద్యం అందించి కంటి చూపును కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News