Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 09:53 AM

శ్రద్ధగా వింటే విజయం మీదే

శ్రద్ధగా వింటే విజయం మీదే

శ్రద్ధగా వింటే విజయం మీదే
19-07-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడలోని కె.ఆర్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలను సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి (DIEO) బి. సులోచనా రాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలోని రికార్డ్స్ పరిశీలించిన అనంతరం అధ్యాపకుల బోధనాశైలిని, విద్యార్థుల క్రమశిక్షణ పట్ల, సమయపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సమావేశంలో డి.ఐ.ఈ.ఓ మాట్లాడుతూ... క్రమశిక్షణతో తరగతి గదిలో పాఠాలను శ్రద్ధగా విన్నట్లయితే విజయం మీ దరి చేరుతుందని అన్నారు. కళాశాలలోని అన్ని వసతులను విద్యార్థులు ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని, మంచి మార్కులతో పై తరగతులు చదివి, జీవితంలో స్థిరపడి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె అన్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థికి హాస్టల్లో ఉచిత వసతి ఉన్నదని, గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రద్ధగా వింటే విజయం మీదే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News