Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:07 AM

ఉమ్మడి జిల్లా అభివృద్ధి జగదీశ్ రెడ్డి తోనేసాధ్యమైంది, మున్సిపల్ చైర్మన్, మండల అధ్యక్షులు రఘు నందన్ రెడ్డి

19-07-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి పట్టణ కేంద్రంలో శనివారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఘు నందన్ రెడ్డి, మండల అధ్యక్షులు బారి కేక్ కట్ చేసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు నందన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు కేసీఆర్‌కు వెన్నంటి నిలిచి ఉద్యమ విజయానికి కీలక పాత్ర పోషించిన నాయకుడు జగదీష్ రెడ్డి అని కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి గత పదేళ్లలో జరిగిందని, ప్రజలకు స్వచ్ఛమైన కృష్ణా తాగునీరు, మెడికల్ కళాశాల, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, నూతన జిల్లా కలెక్టరేట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువచ్చి రూపురేఖలను మార్చిన ఘనత జగదీష్ రెడ్డిదేనని కొనియాడారు. బడుగు, బలహీన, దళిత వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి, ప్రజాసేవలో ఆదర్శ నాయకుడిగా నిలిచారని అన్నారు. వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లతో ఉండాలని దేవునికోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గోవిందమ్మ, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీలు, గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

ఉమ్మడి జిల్లా అభివృద్ధి జగదీశ్ రెడ్డి తోనేసాధ్యమైంది, మున్సిపల్ చైర్మన్, మండల అధ్యక్షులు రఘు నందన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News