ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ న్యాయవాది వాకిటి నరసింహారెడ్డి
రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 'ది అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్' (టీఏఎంఏసీఎస్) పాలకవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ఆవరణలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.ఈ ఎన్నికల్లో చౌటుప్పల్ సివిల్ కోర్టు ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ), చౌటుప్పల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాకిటి నరసింహారెడ్డి పాల్గొని తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం సొసైటీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి