Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉత్సాహంగా అడ్వకేట్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 20, 2026 09:04 AM

దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగళ్య మెగా ఎంట్రీ. సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా 32వ శాఖ ప్రారంభం.

దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగళ్య మెగా ఎంట్రీ. సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా 32వ శాఖ ప్రారంభం.

దిల్‌సుఖ్‌నగర్‌లో మాంగళ్య మెగా ఎంట్రీ. సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా 32వ శాఖ ప్రారంభం.
July 19, 2026 08:36 AM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడు రాష్ట్రాల్లో విజయవంతమైన ప్రస్థానం.. త్వరలో మరో 10 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం

హైదరాబాద్, జూలై 17 స్థానికం ప్రతినిధి: చేనేత, పట్టు, ఫ్యాషన్ వస్త్రాల విక్రయంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాంగళ్య షాపింగ్ మాల్ మరో మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 32వ శాఖను గురువారం సినీ నటి మీనాక్షి చౌదరి ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించిన ఆమె, వివిధ విభాగాలను సందర్శించి వస్త్ర కలెక్షన్లను పరిశీలించారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "దిల్‌సుఖ్‌నగర్ ప్రజలకు మాంగళ్య నాణ్యమైన వస్త్రాలను అందించే విశ్వసనీయ కేంద్రంగా నిలుస్తుంది. ఈ శాఖకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు.

వరంగల్ నుంచి రాష్ట్రాల దాకా...

2012లో వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్ నాణ్యమైన వస్త్రాలు, అందుబాటు ధరలు, వినియోగదారుల విశ్వాసంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విజయవంతంగా విస్తరించింది. ప్రస్తుతం 32 శాఖలతో వస్త్ర వ్యాపార రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించింది.

నాణ్యతే మా విజయ రహస్యం

మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహమూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి, ప్రతి శుభ సందర్భానికి అవసరమైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడం తమ లక్ష్యమని తెలిపారు. స్వంత హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లతో అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందుతున్నామని పేర్కొన్నారు.

త్వరలో మరో 10 శాఖలు

మూడు రాష్ట్రాల్లో మరో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన యాజమాన్యం, తదుపరి తమిళనాడులోనూ విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా మాంగళ్యను పాన్ ఇండియా నంబర్-1 వస్త్ర బ్రాండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొంది.

శుభకార్యాలకు మాంగళ్యే చిరునామా

వివాహాలు, శుభకార్యాలు, పండుగల కోసం అవసరమైన వస్త్రాలన్నీ ఒకే చోట లభించేలా ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉంచామని, వినియోగదారులు కుటుంబ సమేతంగా విచ్చేసి మాంగళ్య ప్రత్యేక షాపింగ్ అనుభూతిని పొందాలని యాజమాన్యం ఆహ్వానించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News