రామన్నపేట పట్టణంలో కబేళా లేకపోవడంతో మేకలు, గొర్రెలను ఇళ్ల ముందు, వీధుల్లోనే వధ చేయడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లడంతో ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కబేళాను వెంటనే పునరుద్ధరించి, ప్రత్యేక మాంసం మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఆదివారం బాబుచారి అధ్యక్షతన జరిగిన సీపీఎం పట్టణ కమిటీ సమావేశంలో మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుట్ల లెనిన్ మాట్లాడుతూ, ఒకే చోట మేకలు, గొర్రెల వధ నిర్వహించి, గ్రామపంచాయతీ ముద్రతో పరిశుభ్రమైన మాంసాన్ని విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రజారోగ్యం పరిరక్షణతో పాటు పరిశుభ్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి